Wednesday 22 July 2020

Neeve Krupa Dharamu telugu lyrics

నీవే కృపాదరము త్రియేక దేవా 
నీవే క్షేమాధారము నా యేసయ్య  '2' 
నూతన బలమును నవనూతన కృపను  '2' 
నేటివరకు దాయచేయుచున్నావు 
నిన్నే ఆరాదింతును పరిశుద్ధుడ 
ఈ స్తోత్రగీతం నీకెనయ్య.                                 "నీవే" 

1. ఆనందించితిని అనురాగబంధాల
 ఆశ్రయపురమైనా నీలో నేను '2'
 ఆకర్షించితివి ఆకాశముకంటే 
ఉన్నతమైననీ ప్రేమను చూపి '2'
 ఆపదలెన్నో అలుముకున్నాను అభయమునిచ్చితివి

ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి 
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు 
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా 
ఈ స్తోత్రగీతం నీకేనయ్య                             "నీవే" 

2. సర్వకృపానిది సీయోను పురవాసి
 నీ స్వాస్థ్యముకై ననుపిలచితివి '2' 
సిలువను మోయుచు నీ చిత్తమును 
నెరవేర్చెదను సహనముకలిగి  '2' 
శిథిలముకాని సంపాదలెన్నో నాకై దాచితివి 
సాహసమైన గొప్పకార్యములు నాకై చేసితివి 
సర్వశక్తిగల దేవుడవై నడిపించుచున్నావు 
నిన్నే ఆరాధింతును పరిశుద్దుడా  
ఈ స్తోత్రగీతం నీకేనయ్య                              'నీవే' 

3.ప్రాకారములను దాటించితివి 
ప్రార్థనవినెడి పావన మూర్తివి  '2'
 పరిశుద్ధులతో ననునిలిపితివి 
నీకార్యములను నూతనపరచి '2'
 పావనమైన జీవనయాత్రలో విజయమునిచ్చితివి 
పరమరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి 
పావనుడా నాఅడుగులుజారక స్థిరపరచినావు 
నిన్నే ఆరాధింతును పరిశుద్దుడా 
ఈ స్తోత్రగీతం నీకేనయ్య



No comments:

Post a Comment