Saturday, 7 July 2018

Ananda ganalatho telugu lyrics

ఆనంద గానాలతో ఆరాధించెద ఐశ్వర్యవంతుడా  యేసయ్య
అనురాగాలు కురిపించి అనువైన దీవెనలు ఇచ్చావని
ఆనంద నగరములో స్వాస్థ్యము నాకై దాచవని

1. అరణ్య ప్రదేశములో నను కనుగొన్నావు
భీకర ధ్వని గల ఎడారిలో  నా తోడున్నావు
నన్నావరించి పరామర్శించి కనుపాప వలె కాపాడినావు
నా శైలము నీవై నా దుర్గము నీవై
ఉన్నత స్థలములపై నను నిలిపావు

2. నా మనో నేత్రములు వెలిగించియున్నావు 
నీ శక్తి యొక్క మహాత్యములు తెలియజేసావు
ఆత్మాభిషేకముతో  అభిషేకించి వాక్యోపదేశముతో బలపరిచావు
నా ధ్యానము నీవై నా ఆరాధనా నీవై
నీ పోలికగా నను మలుచుచున్నావు

3. నీ జీవ గ్రంధములో నా పేరు రాసావు
నీ పరిశుద్ధలంకారముతో   అలంకరించావు
నీ బూర శబ్దమును నే వినగానే నా శరీరము మార్పుచెందును 
నా నిరీక్షణ నీవై నా మహిమా నీవై
తేజో వాసులతో నను చేర్చెదవు






Saturday, 24 March 2018

Ardham chesukune apthudavu lyrics


అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే
ప్రేమను పంచగలిగినా పరమ తండ్రివి నీవె
సహయం చెయగలిగిన నా హితుడవు నీవే
నీ ప్రేమ చాలయ్య నను కొన్న యేసయ్య
నీ ప్రేమ చాలయ్య నను కన్న యేసయ్య

1 కన్నీరు తడిచి కలతలను బాపే
కలుషాత్ములను కడిగే కరుణాత్ముడవు నీవే
కృపా సత్య సంపూర్ణమై నా హృధిని గెలిచావే
కొనియాడ  నా యేసయ్య కోటి కంటాలతో
కీర్తించే నా యేసయ్య స్తోత్ర గీతాలతో
ఎందుకింత ప్రేమయ్య నా పైన యేసయ్య

2 వేదనలు తొలగించి శోధనలు గెలిపించి
వారసునిగా మార్చి వీరునిగా చేసావే
వాక్యంతో నను నింపి వారధిగా నిలిపావే
విలువైన పిలుపుతో పిలిచి వెన్నంటే ఉన్నావే  
ఎంత వింత ప్రేమయ్య నా పైన యేసయ్య