Wednesday, 31 August 2016

yesayya ninnu chudalani lyricsయేసయ్య నిను చూడాలని యేసయ్య నిను చేరాలని

యేసయ్యనీతో ఉండాలని యేసయ్య నీలా నిలవాలని

ఆశగొనియున్నది నా మనస్సు

తృష్ణగొనియున్నది నా హృదయం


ఎటు చూసిన పాపమే చీకటి కమ్మిన లోకములో

ఎటుపోయిన వేదనే పాపము నిండిన పుడమిలో

నీలా బ్రతకాలని నీతో ఉండాలని

ఆశగొనియున్నది నా మనస్సు

తృష్ణగొనియున్నది నా హృదయం


యదవాకిట శోదనే ద్వేషము నిండినా మనుషులతో

హృదిలోపట శోకమే కపటమైన మనస్సులతో

నీలా బ్రతకాలని నీతో ఉండాలని

ఆశగొనియున్నది నా మనస్సు

తృష్ణగినియున్నది నా హృదయం
No comments:

Post a Comment