Tuesday, 30 August 2016

satyamunaku memu sakshulamu lyrics

సత్యమునకు మేము సాక్షులము

క్రీస్తుకు మేము సాక్షులము (2)

రోషముగల దేవుని ప్రజలం

సత్యము కలిగి జీవిస్తాం

రోషముగల దేవుని ప్రజలం

సత్యము కొరకు మరణిస్తాం

హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా

హోసన్నా….హోసన్నా….హోసన్నా…..


ఉమ్ములూసినా మొఖము త్రిప్పము

ముళ్ళ గ్రుచ్చినా తలను వొంచము

కొరడ విసిరినా వెనుక తిరుగము

బల్లెము పొడిచినా భయపడము (2)

సత్యము కలిగి జీవిస్తాం సత్యము కొరకు మరణిస్తాం (2)


మాకు మేము తగ్గించుకొంటాం

మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్థన చేస్తాం

సిలువ సంకెళ్ళ సమర్పణ చేస్తాం

దేవుని రాజ్యము రగిలిస్తాం

సత్యము కొరకు మరణిస్తాం (2)

No comments:

Post a Comment