Wednesday, 10 August 2016

rajula rajuvayya neeve lyrics

రాజుల రాజువయ్యా నీవే మా రాజువయ్యా

రాజాధిరాజువయ్య నీవే మహా రాజువయ్యా

ఇహలోకాన్ని పాలించే నాధుడ నీవయ్యా (2)

మహిమయు ఘనతయు ఇహమందు పరమందు చెల్లును (2)


నోటిమాటతో భూమిని చేసెన్ నేలమంటితో మనిషిని రూపించెన్

జీవము పోసి జీవాయువు నూదెన్ శూన్యములోనే సర్వసృష్టిని చేసెన్

మహిమయు ఘనతయు ఇహమందు పరమందు చెల్లును (2)

స్తోత్రాలయ్యా….


నీ చెంగు ముట్టిన స్వస్థత కలిగెన్ నీ చేయి తాకిన శవములు లేచెన్

సాతాను శక్తులే గడగడగడలాడెన్ సేనా దయ్యమే గజగజగజ వణికెన్

మహిమయు ఘనతయు యుగయుగములు నీకే చెల్లును (2) హల్లెలూయా.........


రాతిబండతో దాహము తీర్చెన్ చేతి కర్రతో సంద్రాన్ని చీల్చెన్

రొటెను విరచి వేవేలకు పంచెన్ ప్రాణాన్నిచ్చి మాకు రక్షణ నిచ్చెన్

మహిమయు ఘనతయు యుగయుగములు నీకే చెల్లును వందనమయ్యా.

No comments:

Post a Comment