గురిలేని పయనం దరి
చేరకుంటే
పొందేదేలా జీవ
కిరీటం
ఆరంభము కంటే
ముగింపు శ్రేష్టమైనది
నిలకడ లేక
ఎంతకాలం
అంజురపు చెట్టు
అకాల ఫలములు
పక్వానికి రాక రాల్చుచున్నది
సిద్దిలో నూనె
లేక ఆరుచున్నది
పరిశుద్దత లేక ఆత్మ దీపము
ఎర్ర సముద్రమును
దాటావు గాని
కానాను చేరలేక పోయావు
ఆత్మనుసారమైన
ఆరంభమే గాని
శరీరుడవై దిగజారిపోయావు
ప్రవక్తలతో
పాలుపొందావు గాని
మోసగించి కుష్టు
రోగివయ్యావు
దైవ చిత్తములో
నడిచావు గాని
అప్పగించావు
ప్రభుని మరణముకు
ప్రభువును పోలి
సిలువను ఎత్తుకొని వెనుకకు తిరుగక పరుగిడుమా
Nice
ReplyDeleteManchi song
ReplyDelete