నేను ఏడ్చినా చోటునే మనసారా నవ్వేదా....
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా... "2"Saturday, 10 October 2020
Nenu odiponaya naa pakshanundaga
Wednesday, 22 July 2020
Nee Prema Nalo telugu lyrics
అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపారతు నిన్నే
సర్వ కృపనిధి నీవు – సర్వాధికారివి నీవు
సత్యా స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే “నీ ప్రేమ నాలో”
1. చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2)
హృదయం నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2)
ఇది నీ బహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో”
2. నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాధా
నీడగా నాతో నిలిచే – నీ కృపాయే నాకు చాలును (2)
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)
“నీ ప్రేమ నాలో”
3. నీ సింహాసనము నను చేర్చుటకు
సిలువను మోయుట నేర్పించితివి (2)
కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)
“నీ ప్రేమ నాలో”
Nuthana Geetham Ne Padedha Telugu Lyrics
నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో
సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే
1. కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని
సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ
నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను
2. కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా
దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ
నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ
3. మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ
నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ
Yepati Dananaya telugu lyrics
నేనెంతటిదాననయా నాపై కృపచూపుటకు
1. నా దోషము భరియించి
నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు
కలువరిలో మరణించి
ప్రేమించే ప్రేమామయుడా
నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగలదేవా
నీ కృపకు సాటియేది "ఏపాటి"
2. కష్తాల కడలిలో
కన్నీటి లోయలలో
నాతోడు నిలిల్చావు
నన్నాదరించావు
అందరు నను విడచినా
నను విడవని యేసయ్యా
విడువను ఎడబాయనని
నా తోడై నిలచితివా
ప్రేమించే ప్రేమామయుడా
నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగలదేవా
నీ కృపకు సాటియేది "ఏపాటి"
3. నీ ప్రేమను మరువలేనయా
నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను
ప్రకటింతును బ్రతుకంతా
నేనొందిన ఈ జయము
నీ విచ్చినదేనయ్యా
నీ విచ్చిన జీవముకై
స్తోత్రము యేసయ్యా
ప్రేమించే ప్రేమామయుడా
నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగలదేవా
నీ కృపకు సాటియేది "ఏపాటి"
Patalathone Payana Sagali Telugu Lyrics
సియోను పాటలు పాడుకుంటూ
హల్లెలూయ పాటలతో – హోసన్నా గీతాలతో
1. యోర్దాను ఎదురోచ్చినా – ఎర్ర సంద్రం పొంగిపొరలిన
ఫరో సైన్యం తరుముకొచ్చినా
యేసయ్య సన్నిధి తోడుండాగా.. తోడుండగా...తోడుండాగా...
2. పగలు మేఘస్తంభమై – రాత్రి అగ్ని స్థంభమై
ఆకాశము నుండి ఆహారమునిచ్చి..
ఎడారిలో సెలయేరులై.. దాహము తీర్చితివి.. దాహము తీర్చితివి..
3. తంబురతో సీతారతో – బూరధ్వనితో స్వరమండలముతో
నాట్యముతో పిల్లనగ్రోవితో..
ఆత్మలో ఆనందించుచూ.. ఆనందించుచూ.. ఆనందించుచూ..
Sumadhura swaramula ganalatho telugu lyrics
కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే నిను స్తుతియించిన ప్రతీక్షణం (2)
|| సుమధుర ||
ఎడారి త్రోవలో నేనడచిన - ఎరుగని మార్గములో నను నడిపిన
నా ముందు నడిచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
నీవే నీవే - నా ఆనందము
నీవే నీవే - నా ఆధారము (2)
|| సుమధుర ||
సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే - నా జయగీతము
నీవే నీవే - నా స్తుతిగీతము (2)
|| సుమధుర ||
వేలాది నదులన్ని నీమహిమను - తరంగపు పొంగులు నీబలమును
పర్వత శ్రేణులు నీకీర్తినే - ప్రకటించుచున్నావేగా (2)
నీవే నీవే - నా అతిశయము
నీకే నీకే - నా ఆరాధన (2)
|| సుమధుర ||
Neeve Krupa Dharamu telugu lyrics
నీవే క్షేమాధారము నా యేసయ్య '2'
నూతన బలమును నవనూతన కృపను '2'
నేటివరకు దాయచేయుచున్నావు
నిన్నే ఆరాదింతును పరిశుద్ధుడ
ఈ స్తోత్రగీతం నీకెనయ్య. "నీవే"
1. ఆనందించితిని అనురాగబంధాల
ఆశ్రయపురమైనా నీలో నేను '2'
ఆకర్షించితివి ఆకాశముకంటే
ఉన్నతమైననీ ప్రేమను చూపి '2'
ఆపదలెన్నో అలుముకున్నాను అభయమునిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా
ఈ స్తోత్రగీతం నీకేనయ్య "నీవే"
2. సర్వకృపానిది సీయోను పురవాసి
నీ స్వాస్థ్యముకై ననుపిలచితివి '2'
సిలువను మోయుచు నీ చిత్తమును
నెరవేర్చెదను సహనముకలిగి '2'
శిథిలముకాని సంపాదలెన్నో నాకై దాచితివి
సాహసమైన గొప్పకార్యములు నాకై చేసితివి
సర్వశక్తిగల దేవుడవై నడిపించుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్దుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్య 'నీవే'
3.ప్రాకారములను దాటించితివి
ప్రార్థనవినెడి పావన మూర్తివి '2'
పరిశుద్ధులతో ననునిలిపితివి
నీకార్యములను నూతనపరచి '2'
పావనమైన జీవనయాత్రలో విజయమునిచ్చితివి
పరమరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి
పావనుడా నాఅడుగులుజారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్దుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్య
Tuesday, 21 July 2020
naalo nivasinchu na yesayya telugu lyics
మారని మమతల మహనీయుడ " 2 "
కీర్తించి నిన్నే ఘనపరతునయ్య - మనసార నిన్నే ప్రేమింతునయ్య " 2 "
1) మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం " 2 "
నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను " 2 "
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను " 2 " " కీర్తించి నిన్నే"
2) వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం
నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే
ఏమని వర్ణింతును నీ కృపలను " కీర్తించి నిన్నే"
3) మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం " 2 "
సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము
యేసయ్య నిన్ను చూచి హర్షింతును " 2 "
భువినేలు రాజ నీ నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం
anandam neelone telugu lyrics
ఆశ్రయం నీలోనే – నాయేసయ్యా స్తోత్రార్హుడా
అర్హతే లేనినన్ను ప్రేమించినావు
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై
1. పదేపదే నిన్నే చేరగా – ప్రతిక్షణం నీవే ధ్యాసగా
కలవరాల కోటలో – కన్నీటి బాటలో
కాపాడే కవచముగా – నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా – స్తోత్ర గీతమా
2. నిరంతరం నీవే వెలుగుని – నిత్యమైన స్వాస్థ్యం నీదని
నీసన్నిధి వీడక – సన్నుతించి పాడనా
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే – జీవ వాక్యమే
3. సర్వ సత్యమేనా మార్గమై – సంఘ క్షేమమేనా ప్రాణమై
లోకమహిమ చూడక – నీజాడను వీడక
నీతోనే నిలవాలి – నిత్య సీయోనులో
నీదర్శనం నా ఆశయం
Saturday, 18 April 2020
రాజుల రాజా రాజాది రాజా Rajula Raja Rajadhi Raja
Saturday, 7 July 2018
Ananda ganalatho telugu lyrics
Saturday, 24 March 2018
Ardham chesukune apthudavu lyrics
Friday, 23 March 2018
ninne namminanu yesayya lyrics
Sunday, 16 July 2017
Ee Jeevitham Viluvainadi lyrics
ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది
సిద్ధపడినావ చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు
సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు
పోతున్నవారిని నువు చుచుటలేదా
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా
మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకంలో ఉండే స్తిరుడెవడు
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి
పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు
యేసు రక్తమే నీ పాపానికి మందు
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు
Thursday, 1 June 2017
ghanamaina naa yesayya lyrics
(నా)శిరము వంచి స్తుతియింతును నీ కృప సత్యములను ప్రకటింతును
నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము
నీ ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము
ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా
తరతరములుగా మనుషులను పోషించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను నే ఎన్నని ప్రకటించెదను నీ కార్యములు
మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము
నీ శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలి యాగము
మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నవయ్యా
మానవ జాతికి రక్షణ మార్గము చూపించు చున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను నే ఎన్నని ప్రకటించెదను నీ కార్యములు
సంఘ క్షేమముకై సంచ కరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము
అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు
పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా
స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను నే ఎన్నని ప్రకటించెదను నీ కార్యములు
yenta manchi kapari
ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2)
తప్పిపోయిన గొర్రె నేను
వెదకి కనుగొన్నావయ్యా
నీ ప్రేమ చూపినయ్య (2) ||ఎంత||
సుఖములంటూ లోకమంటూ
నీదు భాగ్యం మరచితి
నీదు సన్నిధి విడచితి (2)
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
నా అతిక్రమములు క్షమియించి
జాలి చూపితివి (2) ||ఎంత||
నా తలంపులు నా క్రియలు
నీకు తెలిసేయున్నవి
నీవే నిర్మాణకుడవు (2)
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
కృతజ్ఞతా స్తుతులు నీకు
సమర్పించెదను (2) ||ఎంత||
siyonu nee devuni
సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము
శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుమూ
యేసే మన విమోచన హల్లెలుయా హల్లెలుయా
యేసే మన సమాదానం హల్లెలుయా హల్లెలుయా
యేసే మన రక్షణ హల్లెలుయా హల్లెలుయా
యేసే మన రారాజు హల్లెలుయా ఆమేన్
1. మా ఊటలన్నియు నీ యందు వున్నవని
పాతలు పాడుము నాట్యము చేయుము
2.ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ
జివ్హఫల మర్పించి సన్నుతించెదం
3. అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే
ఆమేన్ అనువానిని ఆరాధించెదం
Vinava manavi yesayya
పల్లవి : వినవా మనవి యేసయ్యా.... ప్రభువా శరణం నీవయ్యా...
మలినము నాగతం, పగిలెను జీవితం, చేసుకో నీవశం “2” వినవా ప్రభువా
చరణం : లోక స్నేహమే కోరి దూరమైతిని... వీడిపోయి నీదారి ఓడిపోతిని
విరిగిన మనసుతో నిన్ను చేరాను, చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా.... నాతండ్రి నీవేనయ్యా - “వినవా మనవి”
చరణం : ఆశయేది కనరాక బేలనైతిని... బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూశాను, చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా.... నాదైవము నీవేనయ్యా - “వినవా మనవి”
Daiva kutumbam
పల్లవి:
దైవకుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం "2"
శాంతి శంతోషాలకు అది నిలయం
ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం "2"
విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు "2"
ఆతీధ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు "2"
దైవకుటుంబపు సంతోషం కని విని ఎరుగని ఆనందం "4"
"దైవకుటుంబం"
1. రక్షణ పొందిన కుటుంబం మోక్ష పురికి సోపానం
క్రమశిక్షణ కలిగిన కుటుంబం వీక్షించు దైవ సాన్నిధ్యం "2"
అపార్ధాలు అంతరాలు లేనట్టి అన్యోన్యత
క్షడ్రుజుల ఘుమఘుమలు గుభాలించు మా ఇంట "2"
అష్టైశ్వర్యాలకు తులతూగే కుటుంబం "2"
తరతరాలు వర్ధిల్లే కుటుంబం "2""దైవకుటుంబపు"
2. మమతలు కలిగిన కుటుంబం సంతృప్తినిచ్చే కుటుంబం
ధాన్య ధన వస్తు వాహనాలు కావు మా యింటి కంభాలు "2"
భయభక్తులు దేవోక్తులు మా అన్న పానాలు
మా యొక్క నట్టింట్లో వసియించును దేవుడు"2"
పెనవేసుకున్న బంధాలే ఈ కుటుంబం "2"
Wednesday, 31 May 2017
ananthuda adarinche yesayya lyrics
ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరూ వున్నారాయ
అనురాగ నిలయుడా ఐశ్వర్యవంతుడా
కనికర పూర్ణుడా నా యేసయ్య
కష్టాల కొలిమిలో నీకిష్టమైన రూపు చేసి
నీ చేతి స్పర్శ తో ప్రతి క్షణము నన్ను ఆదరించి
మహిమ స్వరూపుడా నా చేయి విడువక
అనురాగము నాపై చూపించుచున్నావు
శత్రువు పై సమరములో రథ సారథివై నడిపినావు
నీ నియమాలను నేర్పించి శత్రువును ఓడించినావు
విజయ సమరయోధుడా నాకు జయము నిచ్చి
విజయోత్సవాలతో ఊరేగించుచున్నావు
విడువక నన్ను ప్రేమించే నిజ స్నేహితుడై నిలిచినావు
నీ హస్త బలముతో అగాధాలు దాటించినావు
నీ సన్నిధి కాంతిలో నన్ను తేజరిల్ల చేసి
ఆనంద నగరికై సిద్ధపరచు చున్నావు