రాజుల రాజా రాజాది రాజా
శతకోటి సూర్య తేజోప్రభా
అసాధ్యమైన కార్యములు
తలవంచుచున్నవి ఈ పరిచర్యలో
సాధ్యపరచు నీ పాదాల ఎదుట " 2 "
వేలకొలది శత్రువులను ఇస్సాకు ఎదుట
నేల వరకు వంచితివి పరాక్రమశాలివై "2"
పరదేసియైన నన్ను ప్రేమతో పిలచి
దృఢపరచుచుంటివి ఈ తరము ఎదుట "2"
గుమిగూడిన శత్రువులను ఏలీషా ఎదుట
అంధులను చేసితివి అగ్ని స్వరూపివై " 2 "
బలహీనుడైన నన్ను బలముతో నింపి
బలపరచుచుంటివి నా శత్రువుల ఎదుట " 2 "
దాస్యము చేయుచుంటిని పాపము ఎదుట
పలుమార్లు పడితిని పరిశుద్ధత నుండి " 2 "
ఉన్నత దర్శనముతో నాపై కృప చూపి
వాడుకొనుచున్నావు నీ సువార్త రధముగా "2"
No comments:
Post a Comment