Thursday, 1 June 2017

Vinava manavi yesayya

పల్లవి :        వినవా మనవి యేసయ్యా.... ప్రభువా శరణం నీవయ్యా...
మలినము నాగతం, పగిలెను జీవితం, చేసుకో నీవశం “2” వినవా ప్రభువా

చరణం : లోక స్నేహమే కోరి దూరమైతిని... వీడిపోయి నీదారి ఓడిపోతిని
విరిగిన మనసుతో నిన్ను చేరాను, చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా.... నాతండ్రి నీవేనయ్యా   - “వినవా మనవి”
చరణం : ఆశయేది కనరాక బేలనైతిని... బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూశాను, చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా.... నాదైవము నీవేనయ్యా   - “వినవా మనవి”

No comments:

Post a Comment