Tuesday, 30 June 2015

krupalanu thalanchuchu telugu lyrics

కృపలను తలంచుచు - ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్   
 

మిమ్మును ముట్టినవాడు - నా కంటి పాపను   
ముట్టునని సెలవిచ్చిన దేవుడు - కాచెను గతకాలం నన్ను    

రూపింపబడుచున్న - ఏ ఆయుధముండినను    
నాకు విరోధమై వర్ధిల్లదుయని - చెప్పిన మాట సత్యం ప్రభువు    

కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలో    
నింగిని చీల్చి వర్షము పంపి - నింపెను నా హృదయం! యేసు    

సర్వోన్నతుడైన - నా దేవునితో చేరి     
సతతము తన కృప వెల్లడి చేయు - స్తుతులతో నింపెను యిలలో    
 
హల్లెలూయ ఆమేన్ - ఆ..., నాకెంతొ ఆనందమే    
సీయోన్ నివాసం - నాకెంతొ ఆనందం - ఆనందమానందమే - ఆమేన్  


3 comments: