Tuesday, 23 June 2015

deva nee krupa telugu lyrics

దేవా! నీ కృప నిరంతరం - మారనిదెపుడు నా ప్రభువా 
నిత్యజీవము గలది ప్రియ ప్రభువా ..... 
దేవా! నీ కృప నిరంతరం

1. పాపినగు నన్ను ప్రభువా - పరిశుద్ధపరచెను నీ కృపయే -2 
    పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలిచితివే -2                

2. రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే -2
    నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే -2                       

3. విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే -2         
    శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే -2                            

4. కృపలో నడుపుము దేవా - కృపతో నింపుము నా ప్రభువా -2

    నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము -2       

No comments:

Post a Comment