Friday, 28 November 2014

santhosham naku santhosham telugu lyrics

సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం
     సంతోషం నీకు సంతోషం - యేసు నీలో ఉంటే సంతోషం
     హల్లేలుయా ఆనందమే - ఎల్లవేళ నాకు సంతోషమే 

1. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా...
    నాకై రక్తాన్ని చిందించి శుద్దునిగాచేసిన
    యేసంటే నాకు సంతోషం     - 2    || హల్లేలూయా ||

2.  ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా... 
    నాకై ఆత్మను ప్రోక్షించి పరలోకం చేర్చిన
    యేసంటే నాకు సంతోషం   - 2  || హల్లేలూయా||


sharon roja yese telugu lyrics

షారోను రోజా యేసే - పరిపూర్ణ సుందరుడు
    ప్రేమ మూర్తియని - ఆదరించు వాడని
    ప్రాణ ప్రియుని - కను గొంటిని
    అడవులైనా లోయలైనా - ప్రభు వెంట నేనువెళ్ళెదను
1. యేసుని ఎరుగని వారెందరో వాంచతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2)
    దప్పికతో ఉన్న ప్రభువునకే (2)- శిలువను మోసే వారెవ్వరు
    అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను   "షారోను"

2. సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగిన వాడు (2)
    చేసిన సేవను మరువకా (2) - ఆధరించి బహుమతులెన్నో ఇచ్చును
    అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను    "షారోను"


sugunalla sampannuda sthuthi gaanala telugu lyrics


సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాలవారసుడా
    జీవింతును నిత్యము నీ నీడలో - ఆస్వాదింతును నీ మాటల మకరందము

1. యేసయ్య నీతో జీవించగానే - నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
    నాట్యమాడెను నా అంతరంగము - ఇది రక్షణానంద భాగ్యమే    "సుగుణాల"

2. యేసయ్య నిన్ను వెన్నంటగానే - ఆజ్ఞల మార్గము కనిపించెనే
    నీవు నన్ను నడిపించగలవు - నేను నడువ వలసిన త్రోవలో        "సుగుణాల"

3. యేసయ్య నీ కృప తలంచగానే - నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
    నీవు నాకిచ్చే మహిమయెదుట - ఇవి ఎన్న తగినవి కావే              "సుగుణాల"


sudhinam sarva janulaku telugu lyrics

సుధినం సర్వ జనులకు - సమధానం సర్వ జగతికి - 2
     ప్రభుయేసుని జననమనాడు - వికసించెను మధినీ నేడు          "సుధి"

1. చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవిత మార్గం - ఆ...ఆ..ఆ.......2
    పరముకు పధమై అరుధించె - వెలుగై యేసుడు ఉదయించె - 2   "సుధి"

2. కన్నీటితో నిండిన కనులను - ఇడుములన్నిటిని తుడువను - ఆ...ఆ..ఆ.......2
    ఉదయించెను కాంతిగా నాడు - విరజిమ్మెను శాంతిని నేడు  - 2   "సుధి"

3. వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే - ఆ...ఆ..ఆ......2
    త్వరలో వచ్చును ఆరేడు - స్థిరపడుమా ఇక ఈనాడు  - 2          "సుధి"


yudha raja simham thirigi leachenu telugu lyrics

యూదా రాజ సింహం - తిరిగి లేచెను
     తిరిగి లేచెను - మృతిన్‌ గెలిచి లేచెను

1. నరక శక్తులన్ని ఓడిపోయెను
    ఓడిపోయెను - ఆవి వాడి పోయెను 

2. దూత సైన్యమంత స్తుతించు చుండ
    స్తుతించు చుండ - యేసుని సన్నుతించుచుండ    

3. మరణ సంకెళ్ళను - త్రెంచి వేసెను
    త్రెంచి వేసెను  - వాటిన్‌ వంచి వేసెను

4. యేసు లేచెనని - మ్రోగుచున్నది
    మ్రోగుచున్నది - భయమున్‌  ద్రోలుచున్నది

5. వనితల్‌ దూత వార్త - విశ్వసించిరి
    విశ్వసించిరి - మదిన్‌ సంతసించిరి

6.పునరుద్ధానుడెన్నడు - మరణించడు
   మరణించడు - మరణించడెన్నడు

7. యేసూ! నీదు పాదం - మ్రొక్కెదము
    మ్రొక్కెదము - మము ముద్రించుము




manavuda karana janmuda telugu lyrics

మానవుడా కారణ జన్ముడా ?  నీ జన్మకు కారణముంది  - 2
    అర్ధం తెలియక నీవు - వ్యర్ధంగా బ్రతుకకు    - 2
    పరమార్ధమున్నదని - ప్రభుకొరకే బ్రతకమని   - 2     

1. పువ్వులెందుకుకాయలెందుకు ? 
    ఋతువులెందుకు ?  కాలాలెందుకు ? 
    ఉన్నవన్ని నీకోసమేనని - నీవు దేవునికోసమేనని  2 
    గమనించి తెలుసుకో - గ్రహియించి మసలుకో   - 2
    నీ జన్మకు కారణముందీ - నీ జన్మకు కారణముందీ     

2. సూర్యుడెందుకుచంద్రుడెందుకు                              
    రాత్రులెందుకుపగలు ఎందుకు?    -  2
    రాత్రి పగలు దేవుడే చేసెనని - ఆదేవుని పని నీవు చేయాలని - 2
    ప్రభువును ప్రకటించి - పాపిని రక్షించి     - 2
    పరలోకం చేర్చాలనీ - పరలోకం చేర్చాలనీ            


mahima ganathaku arhudavu nive na dhaivamu telugu lyrics

మహిమ ఘనతకు అరుహుడవు నీవే నాదైవము -2
    సృష్టికర్త ముక్తి ధాత - 2 మా స్తుతులకు పాత్రుడా..
    ఆరాధనా నీకే....ఆరాధనా నీకే ...
    ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
    ఆరాధన నీకే....ఆరాధన నీకే ...
1. మన్నాను కురిపించి నావు - బండనుండి నీళ్ళుచ్చినావు - 2
    యెహోవా యీరే చూచుకొనును - 2 సర్వము సమకూర్చును
    ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
    ఆరాధన నీకే....ఆరాధన నీకే ...     "మహిమ"
    2. వ్యాధులను తొలగించినావు - మృతులను మరి లేపినావు - 2
    యెహోవా రాఫా స్వస్థపరచును -నను స్వస్థ పరచును
    ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
    ఆరాధన నీకే....ఆరాధన నీకే ...     "మహిమ"


margamu chupumu intiki telugu lyrics

మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి
    మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి

1. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము
    పశ్చాత్తాపమునొంది  తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము
    ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించె దైర్యము  "మార్గము"

2. ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
    ధరణి భోగములెల్ల బ్రతుకు ద్వంసము చేసె దేవానిన్‌ చేరితి
    దేహియని నీవైపు చేతులెత్తిన  నాకు దారిని చూపుము         "మార్గము"

3. దూరదేశములోన భాగుండు ననుకొనుచు తప్పితి మార్గము
    తరలి పోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము 
    దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి ధన్యుని జేయుము     "మార్గము"

4. కొడుకునే కాదనుచు గృహమే చెరశాలనుచు కోపించి వెళ్ళితి
    కూలి వానిగనైన నీయింట పనిచేసి కనికరమే కోరుదు
    కాదనకు నాతండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము   "మార్గము"

5. నా తండ్రి ననుజూచి పరుగిడుచు ఏతెంచే నా పైబడి ఏడ్చెను
    నవ జీవమును కూర్చి ఇంటికితోడ్కొనివెళ్ళి నన్ను ధీవించెను

    నాజీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమైయుండును "మార్గము"

prabhuva nee kaluvari tyagam bro yesanna song telugu lyrics

ప్రభువా నీ కలువరి త్యాగము - చూపెనే నీ పరిపూర్ణతను
    నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే                "ప్రభువా"

1. నీ రక్షణయే ప్రాకారములని - ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి - 2
    లోకములోనుండి ననువేరు చేసినది  - నీదయా సంకల్పమే   - 2     "ప్రభువా"

2. జీవపు వెలుగుగ నను మార్చుటకే - పరిశుద్ధాత్మను నాకొసగితివే - 2
    శాశ్వత రాజ్యముకై నను నియమించినది - నీ అనాది సంకల్పమే - 2 "ప్రభువా"

3. సంపూర్ణునిగా నను మార్చుటకే - శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2
    పరిపూర్ణ శాంతితో నను కాచుటయే - నీ నిత్యసంకల్పమే   - 2            "ప్రభువా"


preminchu devudu rakshinchu devudu telugu lyrics

   ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు - పాలించు దేవుడు యేసు దేవుడు
   పాటలు పాడి ఆనందించెదం – ఆహా  ఎంతో ఆనందమే......(2)

1. తల్లిదండ్రుల కన్నా దాత యైన దేవుడు
    ప్రతి అవసరమును తీర్చు దేవుడు
    హల్లెలూయ  ఆనందమే సంతోషమే  సమాధానమే

2. నన్ను స్వస్థ పరచి శక్తి నిచ్చు దేవుడు
    తోడు నీడగ నన్ను కాపాడును
    హల్లెలూయ  ఆనందమే సంతోషమే  సమాధానమే   

3. నిన్న నేడు ఏకరీతిగా వున్నాడు
     సర్వ కాలమందు జయ మిచ్చును
     హల్లెలూయ  ఆనందమే సంతోషమే  సమాధానమే

4. ఎల్లవేళలు నన్ను నడిపించే దేవుడు
     అంతము వరకు చేయి విడువడు
    హల్లెలూయ  ఆనందమే సంతోషమే  సమాధానమే


prabhuva kachithivi intha kalam telugu lyrics

 ప్రభువా కాచితివే ఇంత కాలం- కాచితివే ఇంత కాలం
    చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా - నీ సాక్షిగా నే జీవింతునయ్యా

1. కోరి వలచావు నాబ్రతు - మలిచావయా
    మరణ చాయలు అన్నిటిని - విరిచావయ్యా (2)
   నన్ను వలచావులే మరి పిలచావులే
   అరచేతులలో నను చెక్కు కున్నావులే (2)  

2. నిలువెల్ల గోరపు విషమేనయ్యా
    మనిషిగ పుట్టిన సర్పానయ్యా (2)
    పాపం కడిగావులే విషం విరచావులే
    నను మనిషిగా ఇలలో నిలిపావులే (2)   


podamu podamu payanamoudamu telugu lyrics

పోదాము పొదాము - పయనమౌదము- సువార్త చెప్ప పోదాము

1.అక్కడి పోదాము ఇక్కడి పోదము ఎక్కడ పోదాము
    సువార్త చాటింప - సాగిపోదాము
2. ఆజాతి ఈ జాతి ఏజాతండి - పరిశుద్దతే మన స్వంతజాతండి 
3. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి - కానాను దేశమే మన ఊరండి
4. ఆరక్తము ఈ రక్తము ఏ రక్తమండి - క్రీస్తేసు రక్తమే పాపం బాపండి
5. ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి - పరలోకమే మన సొంత ఊరండి
6.ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి - క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి


paavurama sangamu pai vralu mide jwalaluga telugu lyrics

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా
     హల్లెలూయా హల్లేలూయా

1. తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలసే
     కడవరిచినుకులు పడగాపొలములో
     ఫలియించెను దీవెనలే

2. అభిషేక కాలంకృతమై అపవాదిని కూల్చెనులే
     సభకే జయము ఊభికే జీవం
     ప్రబలెను ప్రభు హృదయములో

3. బలహీనతలో బలమా పరిశుద్దతలో వరమా

     ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా