దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే
నీ బదులేమో మానవా
ధనము కోరుతావా ఆ..ఆ. ఘనము కోరుతావా ఆ..ఆ... (2)
అల్పకాల పాపభోగములను కోరుతావా
జ్ఞానమును అడిగాడు పాపములో మునిగి
అజ్ఞానిగా మిగిలాడు సౌలమోను ఆనాడు
బలమును పొందాడు బలవంతుడయ్యాడు
బలహీనతలో పడి పోయాడు సమ్సోను
జ్ఞానులు బలవంతులు బంధీలై
బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో.
ప్రభు కృపను కోరుతావో.
మన రక్షణ కోరాడు మనకై ఏతెంచాడు
మనస్థానమందు నిలచి మరణించె మనప్రభువు
ఆత్మలను అడిగాడు హతసాక్షి అయ్యాడు
అందరికి మాదిరిని చూపాడు ఆ పౌలు
యేసువైపు చూస్తు నీవు పయనమయోతావో
ఆ దేవుని దయను కోరి ధన్యుడౌతావో. మరి ఏమి కోరుతావో…
No comments:
Post a Comment