షారోను రోజా యేసే - పరిపూర్ణ సుందరుడు
ప్రేమ మూర్తియని - ఆదరించు వాడని
ప్రాణ ప్రియుని - కను గొంటిని
అడవులైనా లోయలైనా - ప్రభు వెంట నేనువెళ్ళెదను
1. యేసుని ఎరుగని వారెందరో వాంచతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2)
దప్పికతో ఉన్న ప్రభువునకే (2)- శిలువను
మోసే వారెవ్వరు
అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను "షారోను"
2. సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగిన వాడు (2)
చేసిన సేవను మరువకా (2) - ఆధరించి
బహుమతులెన్నో ఇచ్చును
అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను
"షారోను"
No comments:
Post a Comment