Pages

Other Links

Friday, 23 May 2014

anni namamula kanna telugu lyrics

అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)
పాపముల నుండి విడిపించును – యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును – క్రీస్తేసు నామము (2) 
సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము (2)    
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము (2)
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము (2)   

No comments:

Post a Comment